CTR: జిల్లాలోని గుడిపాల మండలం కృష్ణాపురంలో నూతన చర్చి భవన నిర్మాణంలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. మోల్డింగ్ పనులు చేపడుతుండగా నిర్మాణం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చర్చి నిర్మాణం కూలి ఆరుగురు మృతి


