హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మనకోసం-మన పోస్ట్ ఆఫీస్ కార్యక్రమం

VZM: గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో గురువారం మనకోసం-మన పోస్ట్ ఆఫీస్ కార్యక్రమం నిర్వహించారు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన సదస్సు ర్యాలీ జరిపారు. గ్రామంలోని పాఠశాలకు వెళ్లి పొదుపు, పోస్ట్ బాక్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.