హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెజవాడలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు

NTR: విజయవాడలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి VMC పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. సీతమ్మవారి పాదాల వద్ద నిమజ్జనానికి వాహనాలు, క్రేన్లు, లైటింగ్, పారిశుద్ధ్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.