హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇస్రో శిక్షణకు సిరిసిల్ల యువకుడి ఎంపిక

SRCL: సిరిసిల్లకు చెందిన యువకుడు సిరిగిరి తేజస్విన్ వర్మకు ప్రతిష్టాత్మక ఇస్రోలో శిక్షణకు అవకాశం లభించింది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా శిక్షణకు ఎంపికయ్యారు. చెన్నై ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తేజస్విన్‌కు అధికారులు ఆఫర్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.