హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో సేవా సంకల్ప్ అభియాన్

MLG: బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో “సేవా సంకల్ప్ అభియాన్” కార్యశాల గురువారం ములుగులో నిర్వహించారు. అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రతి బూత్‌లో రక్తదానం, ఆరోగ్యం, స్వచ్ఛత, పర్యావరణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.