హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానసిక ఒత్తిడి నివారణకు ర్యాలీ

KDP: మైదుకూరు మండలం చింతకుంటలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ వికసిత మాట్లాడుతూ.. సమస్యలు, మానసిక ఒత్తిళ్లు తాత్కాలికమేనని, ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని నిందించకుండా వారి బాధను విని, వైద్య సహాయం అందించాలని సూచించారు.