హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడోత్సవాల్లో బాలనగర్ విద్యార్థుల ప్రతిభ

NZB: జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామంలో జరిగిన మండల క్రీడోత్సవాల్లో బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బాలికల కబడ్డీలో ప్రథమ, బాలుర కబడ్డీలో తృతీయ బహుమతితో పాటు మార్చ్‌ఫాస్ట్‌లోనూ బహుమతి సాధించారు. డ్యాన్స్ పోటీల్లో మరాఠీ గీతానికి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి బహుమతి అందుకున్నారు. విద్యార్థులను సర్పంచ్ రాజు, హెచ్‌ఎం సునీత అభినందించారు.