హైదరాబాద్: 28°C
తెలంగాణ

15 ఏళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూపులు

MBNR: జడ్చర్ల నసరుల్లాబాద్‌కు చెందిన జయమ్మ భర్త సత్తయ్య మృతి చెంది 15 ఏళ్లు గడిచినా వితంతు పెన్షన్ రావడం లేదని జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్షకు దిగారు. పెన్షన్ కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని తెలిపారు. తనను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విసిగిపోయి దీక్షకు దిగానని తెలిపారు.