హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహమ్మదాబాద్‌లో ఏడు నకిలీ క్లినిక్‌లు సీజ్

MBNR: మహమ్మదాబాద్‌లో అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న 7 నకిలీ క్లినిక్లపై డీఎంహెచ్ఐ డా. ఏ. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు చేసి సీజ్ చేశారు. అర్హత లేని వారు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాలని సూచించారు.