హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓ సర్వే

ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామంలో గురువారం ఎంపీడీవో పుల్లారావు సందర్శించారు. ఈ సందర్బంగా పూర్తయిన, పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇంటి నిర్మాణ పనులను నాణ్యతతో నిర్మించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించారు. పారిశుధ్యంపై పలు సూచనలు చేశారు. సర్పంచ్ రాథోడ్ సురేష్, పంచాయతీ కార్యదర్శి కుమ్ర మోతిరాం ఉన్నారు.