హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నెట్‌వర్క్ పనులు వేగవంతం చేయాలి'

ASR: మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన టెలికాం సేవలు అందించేందుకు చేపట్టిన సెల్ టవర్ల నిర్మాణం, భూసేకరణ పనులపై జేసీ శ్రీపూజ గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలను త్వరగా సమర్పించాలని కోరారు. మంజూరైన టవర్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.