కృష్ణా: మచిలీపట్నం కార్పొరేషన్ మెయిన్ పార్కుకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలను వితరణ చేశారు. దివంగత లంకిశెట్టి పాండురంగారావు, దుర్గా వెంకటసాయి ప్రసాద్ జ్ఞాపకార్థం కుమారుడు రామకృష్ణ ఈ బెంచీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పార్కుకు సిమెంట్ బెంచీల వితరణ


