హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ కోతలకు నిరసనగా రైతుల ధర్నా

SRCL: రుద్రంగిమండల కేంద్రంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు సబ్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తరచూ కరెంట్‌ నిలిచిపోవడంతో బోర్‌ మోటార్లు దెబ్బతింటున్నాయని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు కొనసాగితే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.