హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న 19 గోవుల స్వాధీనం

కృష్ణా: కృత్తివెన్నులో అనుమతులు లేకుండా 19 గోవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్‌ చేశారు. తుని నుంచి నెల్లూరుకు గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో 216 హైవేపై స్థానికులు వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. గోవులను గూడూరు మండలం తరకటూరు గోసంరక్షణశాలకు తరలించినట్లు ఎస్సై పైడి బాబు తెలిపారు.