హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం నిర్వహించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ శివకుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పోషణ స్టాల్ ఏర్పాటు చేసి పోషకాల గురించి తల్లులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. పిల్లలకు అందజేసే పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించి, గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు. అనంతరం తల్లులతో పోషణ ప్రతిజ్ఞ నిర్వహించారు.