హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా ఇసుక తరలింపు.. వాహనాలు స్వాధీనం

ప్రకాశం: నాగులప్పలపాడులో గురువారం గుండ్లకమ్మ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లతో పాటు జేసీబీ వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలించడం నేరమని దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.