W.G: వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని నరసాపురం ఆర్డీవో దాసిరాజు పిలుపునిచ్చారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో న్యాయవాది పిప్పళ్ల సుప్రజ ఆధ్వర్యంలో ఆర్డీవో, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలు, వ్రత కల్ప పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న సుప్రజను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి విగ్రహాలతో చవితి జరుపుకోవాలి: RDO


