KNR: HYDలో టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద దళితుల నిరసన అనంతరం రహదారులను పసుపు నీటితో శుద్ధి చేయడం అవమానకరమని ఆరోపించారు. దీనికి బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, బీఎన్‌ఎస్ తదితర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'దళితుల అవమానంపై చర్యలు తీసుకోవాలి'


