BPT: కారంచేడులోని జయప్రకాష్ నారాయణ మంచినీటి చెరువు సమీపంలో పైప్‌లైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. గత కొన్ని రోజులుగా లీకేజీ కారణంగా నీరంతా కాలువల్లోకి చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి, పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పైప్‌లైన్ పగిలి నీరు వృథా


