హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలి DSP కీలక సూచనలు

NLR: వినాయక చవితి సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కావలి DSP రమణ సూచించారు. గ్రామాల్లో నిర్వహించే వినాయక విగ్రహాల ఊరేగింపులు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. మద్యం సేవించి గొడవలు, అల్లర్లకు పాల్పడవద్దని సూచించారు. నిమజ్జనం రోజున పెద్దలు, పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.