ATP: అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ) శిక్షణ పొందుతున్న 101 మంది కానిస్టేబుళ్లకు మూడు రోజుల క్రీడోత్సవం గురువారం ప్రారంభమైంది. పోలీస్ ట్రైనింగ్స్ డీఐజీ కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం.నాగభూషణం పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ప్రశాంతతను ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుళ్లకు మూడు రోజుల క్రీడోత్సవం


