హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రముఖ రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా కందుకూరు పరిధిలోని నేదునూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్టర్ రాంరెడ్డి అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.