కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో 100 రోజుల హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ తనిఖీదారు రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.49,93,177, అన్న ప్రసాదం హుండీ ద్వారా రూ.1,54,347 కలిపి మొత్తం రూ.51,47,524 ఆదాయం లభించింది. అలాగే 2.4 గ్రాముల బంగారం, 86 గ్రాముల వెండి, 40 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని ఈవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం


