హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తిలో ఉచిత AI శిక్షణ ప్రారంభం

వనపర్తి వెల్నెస్ సెంటర్‌లో సత్య సోదక్ సమతా సమాజ్ ఆధ్వర్యంలో గోపిరెడ్డి జైపాల్‌రెడ్డి స్మారకార్థం 30 రోజుల ఉచిత AI శిక్షణను గురువారం ప్రారంభించారు. సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పాల్గొని, భవిష్యత్ ఉపాధికి AI కీలకమని, యువత AI నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.