కోనసీమ: కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.22.64 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిధులతో మొత్తం 41 పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్&బీ శాఖకు రూ.11.90 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.3.96 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.6.78 కోట్లు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
'కొత్తపేట అభివృద్ధికి భారీ నిధులు'


