హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలకు మైక్ సెట్ విరాళం

NGKL: అచ్చంపేట మండలం నడింపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1994-95 పూర్వ విద్యార్థులు రూ.20,000 విలువగల మైక్ సెట్‌ను గురువారం పాఠశాల ఉపాధ్యాయులకు విరాళంగా అందజేశారు. పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు జాఫర్ అభినందించారు. మైక్ సెట్ పాఠశాల సంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.