హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారికి రూ.4 లక్షల ఎల్‌వోసీ అందజేత

JGL: సారంగాపూర్ మండలం తాళ్లధర్మారంకు చెందిన సుమన్-నవ్య దంపతుల కూతురు గుండె జబ్బుతో బాధపడుతుంది. ఆమె చికిత్సకు సీఎం సహాయనిధి ద్వారా రూ.4 లక్షల ఎల్‌వోసీ మంజూరు కాగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బాధిత కుటుంబానికి గురువారం ఈ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.