హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

SRPT: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్‌లో ఎస్పీ నరసింహ, అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.