హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి

SDPT: రైతులు సాగు చేసిన పంట వివరాలను సర్వే నంబర్‌ వారీగా డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జె.స్వరూపరాణి సూచించారు. బెజ్జంకి మండలం చీలపూర్‌లో పంట నమోదు ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ వాలంటీర్‌ ద్వారా పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, లేకుంటే పంట విక్రయంలో ఇబ్బందులు అవుతాయన్నారు.