హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుల్లంపేటలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

అన్నమయ్య: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పుల్లంపేట మండలంలోని వత్తలూరు, పెద్దూరు, తిప్పాయపల్లి గ్రామాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. పేకాట, కోళ్ల పందేలు, గంజాయి, బహిరంగ మద్యం సేవనంపై పర్యవేక్షించారు. అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.