హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవు కోసం విద్యార్థిని చంపబోయారు

CTR: పీలేరు నియోజకవర్గంలో దారుణ ఘటన వెలుగుచూసింది. కేవీపల్లె మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. వారం క్రితం అర్ధరాత్రి గొంతు నొక్కి హత్య చేసేందుకు ప్రయత్నించగా బాధిత విద్యార్థి తప్పించుకున్నాడు. ఘటనపై ఎంఈఓ రెడ్డిబాషా విచారణ చేపట్టారు. పాఠశాలకు సెలవులు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.