హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MLG: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. గురువారం బండారుపల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, వంటశాల, భోజనశాల, వసతిగృహాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.