హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీసీఐ పరిశ్రమ అంశాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించాలి'

ADB: ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించే అంశాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ బలంగా ప్రస్తావించాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ డిమాండ్ చేశారు. పట్టణంలో కొనసాగుతున్న రిలే దీక్షలు గురువారం ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా గత ఎన్నికల్లో ఇచ్చిన సీసీఐ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.