హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!

KKD: రాబోయే మూడు గంటల్లో జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్ష సమయంలో గంటకు 40 నుంచి 50 కి.మీ మేర ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో జిల్లాకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ చేస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా గాలులు వీచే నేపథ్యంలో చెట్లు, భవనాల కింద ఉండరాదని హెచ్చరించింది.