హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మహర్దశ..!

SKLM: భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ శంషేర్ సింగ్ రావత్ అన్నారు. ఈ మేరకు ఆయన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి చారిత్రాత్మక డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.