హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొల్లూరులో వర్షాల కోసం జల దీక్ష

NRPT: ఊట్కూరు మండలంలోని కొల్లూరు గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ కొల్లూరులో గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు నీళ్లల్లో గంటల తరబడి కూర్చొని వానదేవుని తలుస్తూ జల దీక్ష నిర్వహించారు. సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, ఊరు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు, మహిళలు, విశేష సంఖ్యలో పాల్గొన్నారు.