హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్‌ను మానుకోండి: కమిషనర్

​SRD: సంగారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మార్కెట్‌కు వెళ్లేటప్పుడు బట్ట, జనపనార సంచులను మాత్రమే వాడాలన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా వీటినే వినియోగించాలని కోరారు. స్వచ్ఛ సంగారెడ్డి లక్ష్యానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.