హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాణ్యం గ్రామాలకు హంద్రీ-నీవా జలాలు

NDL: పాణ్యం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు హంద్రీ-నీవా సుజల స్రవంతి జలాలు విడుదలయ్యాయి. తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధికారులతో సమీక్షించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా అందించాలని సూచించారు. ఆర్డీవో మనోహర్ ఆధ్వర్యంలో అధికారులు నీటి ప్రవాహాన్ని పరిశీలించి, రేమడూరు, పుసులూరు తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టారు.