హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్ శివాలయానికి ధ్వజస్తంభం

RR: ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన నూతన ధ్వజస్తంభం షాద్‌నగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని శివాలయానికి శనివారం చేరుకుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి తొలి పూజ నిర్వహించారు. వేదపండితుల ముహూర్తం ప్రకారం త్వరలో ప్రతిష్ఠించనున్నారు.