హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

కడప జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు బృందాలను పంపి సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.