హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శక సేవలు

RR: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు మేలు జరుగుతుందని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ అన్నారు. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో గురువారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు పారదర్శకంగా అందించడంలో స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని జగన్ తెలిపారు. కార్డులు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.