హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అవగాహన కార్యక్రమం

KMR: జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో గురువారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) సౌజన్యంలో రైతులకు అవగాహన కల్పించారు. నూనె గింజ పంటల సాగు, ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ ఇచ్చారు. పంట నమోదు, పంట బోనస్‌పై సూచనలు, సేంద్రీయ వ్యవసాయం, ఫెర్టిలైజర్ యాప్ సమస్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మండల అధికారి కిషన్, ఏఈఓ స్వాతి, రోజా, రైతులు తదితరులు పాల్గొన్నారు.