హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు సీజ్

NLR: బోగోలు మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను బిట్రగుంట పోలీసులు పట్టుకున్నారు. గురువారం గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్రావెల్ తరలిస్తున్న లారీలు, జెసీబీని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.