హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోక్షితకు జాతీయ చెస్ పోటీలకు ఎంపిక

అన్నమయ్య: రాజంపేట కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని కోసినపల్లి మోక్షిత 55వ జాతీయ చెస్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నీరజ్ కుమార్ శ్రీవాస్తవ మోక్షితను అభినందించారు. ఆమె కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావం ఫలితంగానే ఈ విజయం సాధించిందని తెలిపారు. జాతీయ స్థాయిలోనూ రాణించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.