కృష్ణా: చల్లపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నిర్మూలన చర్యలు చేపట్టారు. గురువారం చల్లపల్లిలో నీరు నిల్వ ఉన్న చెరువుల్లో దోమల ఉత్పత్తి నిరోధించేందుకు గంబూజియ చేప పిల్లలు వదిలారు. పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ హైందవి, డాక్టర్ కృష్ణతేజ పర్యవేక్షణలో సబ్ యూనిట్ ఆఫీసర్ సువర్ణరాజు, సీహెచ్‌వో, ఎంఎల్.హెచ్.పీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చల్లపల్లిలో దోమల నిర్మూలన చర్యలు


