హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా కైకాలపేట వై జంక్షన్!

కోనసీమ: రోడ్డు ప్రమాదాలకు మామిడికుదురు మండలం పాసర్లపూడి కైకాలపేట జాతీయ రహదారి వై జంక్షన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వారంలో రెండు ఘోర ప్రమాదాలు జరిగాయని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందించి ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.