హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారి లేక.. బురదలోనే శవయాత్ర..!

KKD: శ్మశాన వాటికకు సరైన దారి లేక జగ్గంపేట మండలం రామవరం అంబేద్కర్‌ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల గట్ల మీదుగా బురదలోనే శవాలను మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియల సమయంలో అవస్థలు తప్పడం లేదని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని అంటున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిస్కరించాలని కోరుతున్నారు.