బాపట్ల మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ధీమా వ్యక్తం చేశారు. బాపట్లలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. మున్సిపాలిటీలోని 34 వార్డుల్లోనూ విజయమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
34 వార్డుల్లో మనదే విజయం: ఎమ్మెల్యే వర్మ


