హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గర్భిణులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి'

కడప జిల్లా కలసపాడు పీహెచ్‌సీలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌లో భాగంగా 34 మంది గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేశారు. గర్భిణులు సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని పోరుమామిళ్ల రామ్మోహన్ రెడ్డి ఆసుపత్రి గైనకాలజిస్ట్ అఖిల, వైద్యాధికారి సాయి తేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో CHO వెంకటసుబ్బమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొని సేవలు అందించారు.