KDP: సిద్దవటం మండలం చాముండేశ్వరి పేట సమీపంలోని రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం మీదుగా భాకరాపేట రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రివేళ రహదారి చీకటిగా ఉండటంతో ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు దుస్థితిపై స్థానికుల ఆవేదన


